हिन्दी | Epaper
కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

TG: వ్యాపార రంగాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’తో ప్రోత్సాహం

Saritha
TG: వ్యాపార రంగాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’తో ప్రోత్సాహం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 20కిపైగా వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వం పెద్దన్న పాత్రను పోషిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. (TG) మహిళలు నిర్ణయాలు తీసుకునే స్థాయి కి ఎదగాలన్నదే తమ ఉద్దేశమని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు తక్కువ ధరల్లో రుచికరమైన ఆహారం అందించే కేంద్రాలుగానే మారడమే కాకుండా, మహిళల జీవితాల్లో వెలుగులు నింపే సాధనాలుగా మారాయన్నారు. రుచి, మమ కారంతో వంటకాలు అందించేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వేదికలుగా నిలుస్తు న్నాయన్నారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్త రాల సమయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై కాంగ్రెస్ సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, బాలునాయక్ తోపాటు ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంచి సీతక్క సమాధానం ఇచ్చారు. మహిళా సాధికారతకు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.

Read also: Nikitha: నిఖిత హత్య కేసులో కొత్త మలుపు

TG: వ్యాపార రంగాల్లో 'ఇందిరా మహిళా శక్తి'తో ప్రోత్సాహం

మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం

ప్రతి మహిళ ఎస్మాచ్లో సభ్యురాలుగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. 15 సంవత్సరాలు దాటిన బాలికల నుంచి పండు ముదుసలి వరకు మహిళా సంఘం సభ్యులుగా చేర్చుతున్నామని, కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. (TG) రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా సాధికారతకు, ప్రజా సంక్షేమానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. పాలనకు గుండెకాయ లాంటి బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మొదలైన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ప్రస్థానం.. ఈ రోజు ఒక ఉద్యమంలా మారుమూల ప్రాంతాల వరకూ విస్తరిస్తోందిన్నారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, పర్యాటక కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ప్రజలకు సేవలందిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 250 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు విజయవంతంగా కొనసాగుతున్నా యన్నారు. షెఫ్ శిక్షణ, క్యాంటీన్ నిర్వహణపై ఒక్కొ క్కరికి రూ.22,300 వ్యయంతో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు 10 రోజుల పాటు హైదరాబాద్లోని జాతీయ పర్యా టక, ఆతిథ్య నిర్వహణ సంస్థ (నిథం) ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు.

క్యాంటీన్లు, పేద ప్రజల ఆకలి తీరించే కేంద్రాలుగా

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు కోసం అవసరమైన పెట్టుబడిని రుణాల రూపంలో అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. రోజూ వేల మందికి అందుబాటు ధరల్లో ఆకలి తీర్చే కేంద్రాలుగా ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు మారాయన్నారు. (TG) ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పేదల జీవితాల్లో పెద్ద ఊరటగా నిలుస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించి, మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, పేద ప్రజల ఆకలి తీరుస్తాయని బలంగా నమ్ముతున్నా మన్నారు. అవసరం ఉన్న ప్రతిచోట ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని నిన్ననే మేడారంలో వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్లెడ్డితో కలిసి మేడారంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క తెలిపారు.

మహిళా స్వయం సహాయక బృందాలు ఇందిరమ్మ లబ్దిదారులకు మహిళా స్వయం సహాయక బృందాలు ఆసరాగా నిలుస్తు న్నాయని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే పేదలకు లోన్లు ఇవ్వటం ద్వారా వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించే దిశలో మహిళా స్వయం సహాయక సంఘాల తోడ్పాటు తీసుకుంటునామన్నారు. తెలంగాణ లోనూ అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న పేదలను మహిళా సంఘాల ద్వారా గుర్తిస్తామని, అవసరమైన చేయూతని ప్రభుత్వం ఇస్తుంద న్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 130 ఐఎం ఎస్ క్యాంటీన్లను ఏర్పాటు చేశామని, మరిన్ని క్యాంటీన్లను దశల వారీగా ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సీతక్క శాసన సభలో ప్రకటించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870