हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG elections: ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!

Saritha
TG elections: ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!

నిబంధనల ప్రకారం కవలలు జన్మిస్తే పోటీ చేయొచ్చు:

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే.. ముగ్గురు పిల్లలకి నిబంధన మళ్లీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఈ నిబంధన నుంచి కొందరికి మినహాయింపులు ఉన్నాయి. అసలు ఈ నిబంధన ఏంటి? ఎవరికి మినహాయింపు? తదితర వివరాలు తెలుసు కుందాం. తెలంగాణలో(TG elections) స్థానిక సంస్థల ఎన్నికల నగారా మో గింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానా లకు ఎన్నికలు జరగనున్నారు. ముందుగా రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత మూడు విడుత ల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 9 నుంచి నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారం భం కానుండగా.. నవంబర్ 11తో ఎన్నికల ప్రక్రియ ముగియ నుంది. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈసారి కూడా ఖిముగ్గురు పిల్లలఖి నిబంధన వెంటాడుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం2018 ప్రకారం.. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించబడతారు.

Read also: ‘చలో నర్సీపట్నం’ అంటున్న జగన్

TG elections

ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో:

ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఇటీవల తొలగించినప్పటికీ.. తెలంగాణలో(TG elections) మాత్రం యథా తథంగా కొనసాగుతోంది. ఈ నిబంధన కార ణంగా గత ఎన్నికల్లో చాలామంది పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. అయితే కొందరికి ఈ ముగ్గురు పిల్లల నిబంధన నుంచి ప్రత్యేక మినహాయింపు ఉంది. అలాంటి వారు ముగ్గురు పిల్లలు ఉన్నా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగానే పరిగణిస్తారు. నిబంధనలు ఇలా ఉన్నాయి 31.5.1995 కంటే ముందు ముగ్గురు పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ తేదీ నాటికి ఇద్దరు పిల్లలుండి, తర్వాత మరో సంతానం కలిగితే మాత్రం వారు పోటీకి అనర్హులు. 31.5.1995కు ముందు ఒక సంతానం కలిగిన తర్వాత కాన్పులో కవల పిల్లలు జన్మిస్తే పోటీకి అర్హులు. (ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు) ఇదే తేదీకి ముందు కవలలు జన్మించి తర్వాత కాన్పులో ఒకరు జన్మిస్తే మాత్రం అలాంటి వారు పోటీకి అనర్హులు.

ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులు:

1.6.1995 తర్వాత మొదటి కాన్పులో ఒకరు, రెండో కాన్పులో కవలలు జన్మిస్తే అలాంటి వారు కూడా పోటీకి అర్హులే.1.6.1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించినా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.1.6.1995 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఇద్దరు పిల్లలున్న వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. ముగ్గురు పిల్లలు పుట్టినా నామినేషన్ పరిశీలనకు ముందే వారిలో ఒకరు చనిపోతే జీవించి ఉన్న పిల్లల లెక్కను పరిగణనలోకి తీసుకుని ఆయా అభ్యర్థులను అర్హులుగా పరిగణిస్తారు. నామినేషన్ పరిశీలన రోజుకు అభ్యర్థి ఇద్దరు పిల్లలు కలిగి.. మళ్లీ గర్భం దాల్చిన మహిళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హురాలే. (జీవించి ఉన్న పిల్లలను మాత్రమే పరిగణిస్తారు). ఇలా కొందరికి మాత్రం ప్రత్యేక సందర్భాల్లో ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులుగానే పరిగణిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870