हिन्दी | Epaper
రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

TG DWCRA:స్త్రీనిధి రుణ బకాయిలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

Rajitha
TG DWCRA:స్త్రీనిధి రుణ బకాయిలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

తెలంగాణలో డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్త్రీనిధి (Sthreenidhi) ద్వారా రుణాలు తీసుకుని నెలవారీ వాయిదాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పేరుకుపోతున్న మొండి బకాయిలను వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం రుణం చెల్లించని వారి ఇళ్లు, భూములు వంటి ఆస్తులను జప్తు చేసి బహిరంగ వేలం ద్వారా విక్రయించే అధికారం అధికారులకు ఉంటుంది. వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేసి ప్రభుత్వ నిధులను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read also: Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఆరోపణలు

TG DWCRA

TG DWCRA

ఒక్కరు కట్టకపోతే అందరికీ భారం – జగిత్యాల జిల్లాలో తీవ్ర పరిస్థి

ఈ వ్యవహారంలో అత్యంత కీలక అంశం గ్రూప్ బాధ్యత. ఒక డ్వాక్రా సభ్యురాలి వద్ద ఆస్తులు లేకపోతే, ఆమె రుణ బకాయిల బాధ్యత మొత్తం గ్రూప్ సభ్యులపై పడుతుంది. అవసరమైతే ఇతర సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో సుమారు 60 వేల మంది డ్వాక్రా సభ్యులకు రూ. 475 కోట్ల రుణాలు అందించగా, అందులో రూ. 23 కోట్లకు పైగా మొండి బకాయిలుగా ఉన్నాయి. ఈ పరిస్థితితో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే SERP, MEPMA అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా స్పందన తక్కువగా ఉండటంతో, త్వరలోనే జప్తు ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870