నూతన సంవత్సరం సందర్భంగా బిర్యానీ తినేందుకు వెళ్లిన స్నేహితుల ప్రయాణాన్ని అడవిపంది రూపంలో మృత్యువు వెంటాడింది. (TG) కారుకు అడ్డంగా అడవిపంది రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో వాహనం బోల్తా కొట్టగా, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహేశ్వరం ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, మహేశ్వరం మండల పరిధిలోని పోరండ్ల గ్రామానికి చెందిన గిరి, శ్రీకాంత్, శివ స్నేహితులు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం రాత్రి బిర్యానీ తినేందుకు స్వగ్రామం పోరండ్ల నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి కారులో వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం తిరిగి పోరండ్లకు బయలుదేరారు.
Read also: Maoist: తెలంగాణ డీజీపీ ఎదుట నేడు లొంగిపోనున్న బరిసె దేవా

తీవ్రంగా గాయపడిన మరో యువకుడు
ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తున్న క్రమంలో (TG) ఆక్సాన్‌పల్లి గేటు సమీపానికి చేరుకోగానే ఒక అడవిపంది రోడ్డు పైకి ఒక్కసారిగా దూసుకు వచ్చింది. అందోళనతో దానిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గిరి (29), శ్రీకాంత్ (27)లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన శివను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: