తెలంగాణ (TG Crime) లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లి మందలించిందన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని హవేలిఘనపూర్ మండలం ముత్తాయిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సంగేమ్ శంకర్, సుజాత దంపతుల పెద్ద కుమార్తె శిరీష (19) ఫోన్ లో గేమ్స్ ఆడుతుండగా తల్లి సుజాత గమనించి ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించింది.
Read Also: Tirupati Crime: ప్రేమ విఫలం కారణంగా యువతి ఆత్మహత్య

చికిత్స పొందుతూ మృతి
మనస్తాపానికి గురైన శిరీష ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగింది. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు అద్దం పడుతోంది. స్మార్ట్‌ఫోన్ల వాడకం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, వ్యసనంగా మారుతోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించడం, పెద్దల మాటలను వ్యతిరేకతగా భావించడం వంటి ధోరణులు పెరుగుతున్నాయి.
సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి బదులు, ఆవేశంలో ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆందోళ కలిగిస్తోంది. పిల్లల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు గమనిస్తూనే.. వారిని సున్నితంగా దారిలో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో యువత కూడా సాంకేతికతకు బానిస కాకుండా, జీవితంపై అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే పోయే ప్రాణాలను కాపాడుకోవచ్చని గుర్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: