దేశంలో మహిళలకు భద్రత కొరవడుతున్నది. స్త్రీలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు వదలిపెట్టడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులకు బలైపోతున్నారు. దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతుండడం బాధాకరం. నెలల పసికందుల నుంచి 70ఏళ్ల ముసలివారిపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై అంగన్వాడీ ఓ టీచర్ కుమారుడు (16) అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read Also: Pakistan: పాక్ సైనికులు గాజాకు పయనం.. ఎందుకంటే?

నిందితుడి కోసం పోలీసులు గాలింపులు
వరంగల్(Warangal) జిల్లా ఖానాపురం మండలంలోని ఒక తండాలో తన ఓ తల్లి తన నాలుగేళ్ల కూతురు (4)ని తల్లి వద్ద వదిలేసి, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. ఎప్పటిలాగే చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. అయితే టీచర్ బయటకి వెళ్లిన సమయంలో టీచర్ కుమారుడు(16) చిన్నారిని పక్కగదిలోకి తీసుకెళ్లి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి స్నానం చేయించే క్రమంలో ఆమె బట్టలపై రక్తం, ఒంటిపై గాయాలు గమనించిన అమ్మమ్మ తన కూతురునికి సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిగా ఇంటికొచ్చిన తల్లి తన బిడ్డపై జరిగిన లైంగిక దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పరారీలో ఉన్న నిందితుడికోసం పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. సదరు మైనర్ బాలుడు అంగన్ వాడీ కేంద్రంలోని పిల్లలను తరచూ వేధిస్తుంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: