ఆడపిల్లలు అంటే కొందరికి చిన్నచూపు. తమకు అలాంటి బిడ్డలే ఉన్నారని, తమను కన్నది కూడా ఓ తల్లే అనే స్పగ్రహ కొందరిలో ఉండదు. తమలోని లైంగిక ఉన్మాదాన్ని తీర్చుకునేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతారు. తాజగా ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలికల టాయిటెట్ లో సీక్రెట్ కెమెరాలు(cameras) తీవ్ర కలకలాన్ని రేపింది. వీటిని పెట్టింది ఆ పాఠశాల అటెండర్ అని తేలింది.
Read Also: Harish Rao: తన బావ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన కెసిఆర్

బాలికలపై లైంగిక వేధింపులు
కరీంనగర్ జిల్లా(Karimnagar District) గంగాధర మండలం కురిక్యాలలోని ప్రభుత్వ పాఠశాలలోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాను అమర్చాడు అటెండర్ యాకుబ్. రెండేళ్లుగా ఈ వీడియోలు, ఫోటోలు తీసుకున్న యాకుబ్ ఎవరికీ దొరకుండా జాగ్రత్తపడ్డాడు. పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాల ఫొటోలను సైతం చిత్రీకరించి.. ఏఐతో విద్యార్థినుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ వచ్చాడు. అంతేకాక బాలికలకు వాటిని చూపి, బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు.
ఆరుగురి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే వారం క్రితం బాత్రూములో ఓ పరికరాన్ని గమనించిన కొందరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఈ బండారం బయటపడింది.
తల్లిదండ్రులు పాఠశాల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపారు. యాకుబ్ ఈ దారుణాలకు పాల్పడినట్లుగా తేలడంతో ఆయనపై పోక్సో కేసు(POCSO case) నమోదు చేశారు. అంతేకాక ఆయనపై సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: