తీవ్రమైన ఒత్తిడి.. వ్యక్తిగత కారణాలు.. అంటూ చాలా మంది.. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ.. కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నారు.. చేతికి వచ్చన తమ బిడ్డలు అర్థాంతరంగా తనువుచాలిస్తుండటం.. ఆ కుటుంబాలకు తీరని శోకంగా మిగులుతోంది.. తెలంగాణ లోని (TG Crime) సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి. లావణ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.
Read also: Telangana: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి రకుల్ సోదరుడు
పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరు
ఈ కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే లావణ్య మృతికి కారణం అని పోలీసులు గుర్తించారు. లావణ్యతో పాటు అదే హాస్పిటల్‌లో చదువుతోన్న ఓ ప్రణయ్ ఆమెను ప్రేమించాడు. కొన్నాళ్ల పాటు వీరి బంధం బాగానే ఉంది, అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరంటూ ప్రణయ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దాంతో మనస్తాపం చెందిన లావణ్య ఆత్మహత్య చేసుకుంది.

రూమ్‌లోనే గత శనివారం ఉదయం పారాక్వాట్ అనే గడ్డి మందును ఇంజక్షన్ లో వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. దీనిని గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు ఆమెను వెంటనే జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్సకోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ లావణ్య గత శనివారం అర్ధరాత్రి మృతి చెందింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: