తెలంగాణ (TG) రాష్ట్రం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. (TG Crime) లింగాపూర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల(50) అనే మహిళ బుధవారం తన ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా.. ఓ కోతుల గుంపు ఆమెపైకి దూసుకొచ్చింది. (TG Crime) అయితే ఆమె వాటిని భయపెట్టి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పట్టుతప్పి ఇంటి మెట్లపై నుండి కింద పడిపోయింది. దీంతో విమల తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Read Also: Telangana: బిర్యానీతో న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. ప్రభుత్వ పాఠశాలల్లో

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: