తెలంగాణ(TG) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని వంట సిబ్బంది (కుక్ కమ్ హెల్పర్లు) సంఖ్యను నిర్ణయించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు.
Read Also: Food poisoning: రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

ఆదేశాల ప్రకారం పాఠశాలలో 25 మంది విద్యార్థులు వరకు ఉంటే ఒక కుక్ కమ్ హెల్పర్‌ను నియమించాలి. 26 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఇద్దరు హెల్పర్లు ఉండాలి. అలాగే 101 నుంచి 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ముగ్గురు హెల్పర్లను కేటాయించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రతి అదనపు 100 మంది విద్యార్థులకు ఒక హెల్పర్‌ను అదనంగా నియమించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే వంట సిబ్బందికి సంబంధించిన ఖర్చుల బిల్లులను తప్పనిసరిగా(TG) ఆన్‌లైన్ విధానంలోనే క్లైయిమ్ చేయాలని ఆదేశించారు. ఈ మార్గదర్శకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో భోజన పథకం(Meal plan) మరింత సమర్థంగా అమలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: