తెలంగాణ (TG) లో, గడచిన కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో చలి మరింతగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే కూడా తక్కువకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read also: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ పోలింగ్.. ప్రముఖులు ఓట్లు వేసేది ఎక్కడంటే?
హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా చలి
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ఇవాళ ఉదయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కొంపల్లి, మల్కాజ్‌గిరి, కాప్రా, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు.

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ.. కనిష్ఠ తీవ్రత కొంచెం అధికంగా ఉండి పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అలాగే ఉదయం 4 గంటల ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు.
సాధారణంగా నవంబర్ నెలలో పొడి వాతావరణం ఉంటుందని భావించినప్పటికీ.. రానున్న రోజుల్లో చలి అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోందన్నారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు చలి తీవ్రత మరింత విపరీతంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: