14 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
TG Cold Wave: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కలిగిన జిల్లాల సంఖ్య కొంత తగ్గినా మొత్తం మీద 14 జిల్లాలలో పది లోపు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి(Sangareddy) జిల్లా కోహిర్లో ఐదు డిగ్రీలు, రంగారెడ్డిలోని మొయినాబాద్లో 6.9, వికారాబాద్లోని నవాబ్పేట్లో ఏడు డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా వున్నాయి.
Read Also: Bollaram: హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక
ఆసిఫాబాద్లోని తిర్యాణిలో 7.2, ఆదిలాబాద్లోని భీంపూర్లో 7.6, మెదక్లోని ఎల్దుర్తిలో 7.9, కామారెడ్డిలోని గాంధారిలో 7.9, నిజామాబాద్లోని సాలూరాలో 8.5, సిద్దిపేట్లోని అక్బర్పేట్లో 8.9, మేడ్చల్లోని ఉప్పల్లో 9.1, నారాయణ్ పేట్లోని నారాయణ్పట్ టౌన్ లో 9.5, మహబూబ్నగర్ లోని గండీడ్లో 9.8, సిరిసిల్లాలోని రుద్రంగిలో 9, జగిత్యాలలోని కతలాపూర్లో 10.1, మంచిర్యాల్లోని కొత్తపల్లిలో 10.2, భూపాలపల్లిలోని ముత్తారంలో 10.3, కరీంనగర్లోని కొత్తపల్లెలో 10.4, పెద్దపల్లిలోని రామగిరిలో 10.4, ములుగులోని గోవిందరావుపేట్లో 10.3, భువనగిరిలోని రాజాపేట్లో 10.6, నల్లగొండలోని చింతపల్లిలో 10.6, హనుమకొండలోని శాయంపేట్ లో 10.7, నాగర్కర్నూలులోని కల్వకుర్తిలో 10.8, జనగాంలోని బచ్చన్నపేట్లో 10.9, వనపర్తిలోని గోపాల్పేట్ లో 11, మహబూబాబాద్ లోని గంగారంలో 11.1, వరంగల్లో లోని నెక్కొండలో 11.2, | హైదరాబాద్లోని మారెడ్పల్లిలో 11.2, గద్వాలలోని లీజాలో 11.3, కొత్తగూడెంలోని గుండాల లో 11.4, ఖమ్మంలోని ఎంకూరులో 12, సూర్యాపేట్లోని ముకుందాపురంలో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్
ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రతలు 14.1 డిగ్రీల సగటున వుండాల్సి వుండగా 2.1 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత యేడాది ఇదే సమయంలో 14.9 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో చలితీవ్రత మరోవారం రోజుల పాటు వుంటుందని వాతావరణశాఖ(Department of Meteorology) అధికారులు తెలిపారు. ఆరంజ్ అలర్ట్ వున్న జిల్లాలకు ఇది మరికొన్ని రోజులపాటు ఉంటుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: