రూ. 362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మం రూరల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18న ఆదివారం పాలేరు నియోజకవర్గంలో (TG) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం రూ.362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. పాలేరు గడ్డపై అభివృద్ధి పండుగలా కార్యక్రమాలు సాగనున్నాయని చెప్పారు. పాలేరు అభివృద్ధికి భారీ ప్యాకేజీ మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం జరుగనున్నాయి.
Read also: Chhattisgarh: మావోయిస్టులపై ఆఖరి పోరుకు పోలీస్ ఆపరేషన్

మేడారంలో చారిత్రాత్మక రాష్ట్ర క్యాబినెట్ భేటీ
అదేవిధంగా (TG) మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ప్రారంభం, కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది అని తెలియజేశారు. ఇట్టి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఇదే వేదికగా రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్య కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ వెలుపల తొలిసారి క్యాబినెట్ భేటీ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోందని పొంగులేటి ప్రకటించారు. గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపించడం మా పనికాదు.. ప్రజల్లోనే తిరుగుతూ పనిచేసే ప్రభుత్వమిదే అని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: