తెలంగాణ (TG) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై నిన్న జిల్లా కలెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్యలు, అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకాన్ని విజయవంతం చేయడంపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కీలక సమావేశంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన చర్చనీయాంశమైంది. వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో, ఒక జిల్లా కలెక్టర్ ఆంగ్లంలో వివరాలను తెలియజేయడానికి ప్రయత్నించారు.
Read also: ఎన్ఐటీ దుర్గాపూర్‌లో నాన్-టీచింగ్ జాబ్స్

తెలుగులో మాట్లాడాలని సీఎం సూచన
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్(TG) ఆంగ్లంలో తమ జిల్లాకు సంబంధించిన వివరాలను వివరించే ప్రయత్నం చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకున్నారు. తెలుగులో మాట్లాడాలని ఆమెకు సూచించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా పాల్గొంటున్నారని, వారికి పూర్తిగా అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు మాతృభాష తెలుగులో మాట్లాడటం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సూచనతో కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆ తర్వాత తమ వివరాలను తెలుగులోనే వెల్లడించారు. ఈ సంఘటన, ప్రజల్లోకి పథకాల వివరాలను సమర్థవంతంగా చేరవేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: