హైదరాబాద్(చార్మినార్): హైదరాబాద్ పాతనగరంలో ఆదివారం అత్యంత వైభవంగా బోనాల (TG Bonalu) జాతర ఉత్సవాలు జరిగాయి. ఆషాడ మాసం సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం (Mahankali Temple), హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, మీరాలమండి మహంకాళేశ్వరి ఆలయం, సుల్తాన్ షాహి జగదాంబ ఆలయం. ఉప్పుగూడ మహంకాళి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మీ మందిరం, దూద్బౌలిలోని మహరాజంజ్ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంతో పాటు పాతనగరం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి పరిధిలోని ఇరవై రెండు దేవాలయాలలో ఆదివారం ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి.

అమ్మ వారికి పట్టు వస్త్రాలు అందచేశారు
శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో ప్రభుత్వం తరుపున అమ్మ వారికి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటి స్పీకర్ రామచందర్ నాయక్, మాజీ మంత్రి గీతారెడ్డి, బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి చైర్మన్ జి. రాఘవేందర్, కమిటి ప్రతినిధులు ఎస్.పి.క్రాంతి కుమార్లు అమ్మవారికి పూజలు నిర్వహించారు. సుల్తాన్హి శ్రీ జగదాంబ ఆలయంలో కమిటి చైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు (Bonala Festival) వైభవంగా జరిగాయి. టిపిసిసి అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపి ఈటల రాజేందర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్తో పాటు పలువురు ఆలయాన్ని సందర్శించి అమ్మ వారికి పూజలు జరిపారు. పాతబస్తీ దూద్బాలిలోని పైనీరు ముత్యాలమ్మ ఆలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, మందిరం కమిటి చైర్మన్ ఆనంద్ గుప్తలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ మందిరంలో అమ్మ వారికి ప్రభుత్వం తరుపున రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎమ్మెల్యే దానం నాగేందర్తోపాటు పలువురు మంత్రులు, ఎంపిలు, కార్పొరేటర్లు, అధికా రులు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వ హించారు. కాగా పాతబస్తీలోని 268 మహంకాళీ ఆలయాలలో ఆదివారం వైభవంగా బోనాలు ఉత్సవాలు జరిగాయి .
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana Rising: తెలంగాణ రైజింగ్-2047.. రాష్ట్రం అందరినీ ఆహ్వానిస్తోంది : సిఎం రేవంత్ రెడ్డి