తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు (Ration card) దారులకు ప్రభుత్వం కీలక అలెర్ట్ జారీ చేసింది. రేషన్ కార్డుతో అనుసంధానమైన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ గడువు లోపు ఈకేవైసీ చేయని యూనిట్లకు భవిష్యత్తులో రేషన్ సరఫరా నిలిపివేస్తామని, అవసరమైతే రేషన్ కార్డును రద్దు చేసే అవకాశమూ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read also: Hyderabad: రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

Big alert for ration cardholders
బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు
ఈకేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడు సమీప రేషన్ దుకాణానికి వెళ్లి ఈపాస్ మిషన్‌లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక లోపాల కారణంగా వేలిముద్రలు సరిగా నమోదు కావడం లేదని లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఈకేవైసీ పూర్తి కాకపోతే అది తమ తప్పు కాదని, సమస్యలు పరిష్కరించి గడువును పొడిగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈకేవైసీ పూర్తికాకపోతే ఉచిత రేషన్‌తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఈకేవైసీ పూర్తి చేసినప్పటికీ ఇంకా పెద్ద సంఖ్యలో కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: