తెలంగాణ (TG) లో చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 0 నుండి 5 ఏళ్లలోపు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు పూర్తిగా ఉచిత చికిత్స అందించేందుకు ‘బాల భరోసా’ పథకం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) త్వరలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
Read Also: TG: తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులు

ఈ సమస్యలను రిష్కరించేందుకు
అంగన్వాడీ, ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి 42 అంశాలపై ఇంటింటి సర్వే చేశారు. 18లక్షల మంది డేటా సేకరించగా 8 లక్షల మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్సతో ఈ సమస్యల్ని పోగొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలో, ఈ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సమగ్ర చికిత్సను అందించాలన్న నిబద్ధతతో ‘బాల భరోసా’ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: