సిద్ధిపేట జిల్లా(Siddipet District) మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో పునర్నిర్మాణం జరుగుతున్న దేవాలయం సమీపంలో పురాతన విడి శిల్పాలున్నాయి. (TG) కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకసభ్యుడు సామలేటి మహేశ్ ఈ శిల్పాలను పరిశీలించాడు. ఇక్కడి 5 అడుగుల ఎత్తున్న చతుర్భుజ గణపతి శిల్పం ఎంతో ప్రత్యేకం. లలితాసనంలో ఆసీనుడైన గణపతి పరహస్తాలలో పరశువు, పుష్పం, నిజ హస్తాలలో విరిగిన దంతం, కుడుములతో ఎడమవైపు తిరిగున్న తొండంతో, పొట్టమీద నాగబంధంతో, మూషికవాహనుడై అగుపిస్తున్నాడు. వెనకవైపున పుష్పం, భుజంపైనుంచి జంధ్యం కనిపిస్తున్నాయి. (TG) ఈ విగ్రహం అలంకరణలశైలి, శిల్పరూపం రీత్యా 11వ శతాబ్దం, చాళుక్యుల కాలం నాటిదని తెలుస్తోంది. అరుదుగా కనిపించే గణపతి శిల్పం ఈ గ్రామంలో కనిపించడంతో ఈ ప్రాంతంలో కాలాముఖ శైవం, గాణపత్యం విస్తరించి వుంటాయని చెప్పవచ్చు.
Read also: TG: సర్కార్ కీలక నిర్ణయం.. ధరణి పోర్టల్ డెడ్‌లైన్ పొడిగింపు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: