అత్యధికంగా 51.48 లక్షల ఎకరాల్లో వరి
వ్యవసాయ శాఖ ప్రణాళిక
హైదరాబాద్: తెలంగాణ(TG) రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 68.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నారు. అయితే, గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం 16.50 లక్షల ఎకరాలు తగ్గడం విశేషం. రాష్ట్రంలోని వాతావరణ(weather) పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటి వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ శాఖ ఈ రబీ సీజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
Read Also: AP SSC : టెన్త్ పరీక్షల ఫీజుల చెల్లింపు తుది గడవు 25

వరి సాగుకు అత్యధిక ప్రాధాన్యత
యాసంగిలో సాగు చేసే మొత్తం విస్తీర్ణంలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ప్రధానంగా వరికి అత్యంత ప్రాధాన్యత కల్పించింది.
- వరి: 51.48 లక్షల ఎకరాలు
- మొక్కజొన్న: 6.45 లక్షల ఎకరాలు
- శనగలు: 3.04 లక్షల ఎకరాలు
- వేరుశెనగ: 2.60 లక్షల ఎకరాల్లో వేసే అవకాశం ఉందని ప్రణాళికలో పేర్కొంది.
గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 80.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్‌లో వ్యవసాయ శాఖ 47.27 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తారని అంచనా వేయగా, అంతకన్నా దాదాపు 15.50 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు జరిగింది. ఇందులో ఒక్క వరియే 12.5 లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు వేశారు.
ఎరువుల కేటాయింపులు
ఈ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 20.10 లక్షల టన్నుల ఎరువులను కేటాయించింది.
- యూరియా: 10.40 లక్షల టన్నులు మంజూరు చేసింది. గత యాసంగి సీజన్‌లో రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా మాత్రమే కేటాయించగా, ఈసారి 60 వేల టన్నులు అదనంగా కేటాయించడం విశేషం.
- ఇతర ఎరువులు: 1.45 లక్షల టన్నుల డ్రై అమ్మోనియమ్ ఫాస్పేట్, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్, 65 వేల టన్నుల మ్యూరో ఆఫ్ పొటాష్, 60 లక్షల టన్నుల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులను కూడా కేటాయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: