Pension: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద 11 రకాల పింఛన్లు అందజేస్తోంది. అయితే చాలా మంది లబ్ధిదారులు వేలిముద్రలు సరిగా పడకపోవడంతో పింఛన్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, రైతులు, కూలీలు వంటి వర్గాలకు వేలిముద్రల చెరగడం వల్ల ధృవీకరణ విఫలమవుతోంది. ఈ కారణంగా కొందరికి పింఛన్ ఆగిపోవడం, మరికొందరు ఆక్రమదారులు దుర్వినియోగం చేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.

ఆధునిక టెక్నాలజీతో పరిష్కారం
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను(Face recognition app) ప్రవేశపెట్టింది. అదనంగా, పోస్టుమాస్టర్లకు ఆధునిక ఫింగర్ ప్రింట్ పరికరాలు మరియు 5జీ స్మార్ట్‌ఫోన్లను అందజేయనుంది. దీని వలన పింఛన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా జరుగుతుంది. చేయూత సామాజిక భద్రతా పథకం లక్ష్యం ఆర్థికంగా బలహీన వర్గాలకు భరోసా కల్పించడం. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వితంతువులు, హెచ్ఐవీ బాధితులు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు వంటి వర్గాలకు ఈ పింఛన్లు ఒక ఆశ్రయంలా నిలుస్తున్నాయి.
సాంకేతికత ఆధారిత ధృవీకరణ
ఇప్పటి వరకు 2జీ ఆధారిత ఫింగర్ ప్రింట్లను వాడేవారు. దీంతో సిగ్నల్ సమస్యలు, వేలిముద్ర సమస్యల వలన లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా కేవలం మూడు సెకన్లలో ధృవీకరణ పూర్తవుతుంది. దీంతో సరైన వ్యక్తికి సరైన సమయంలో పింఛన్ అందేలా ఒక పారదర్శక వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.15.50 కోట్ల బడ్జెట్ కేటాయించి, ఆధునిక ఫింగర్ ప్రింట్(Fringer Print) పరికరాలు మరియు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 6,300 బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు ఈ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ములుగు జిల్లా పస్రాలో మంత్రి సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పోస్టుమాస్టర్లకు పరికరాలు అందజేయనున్నారు.
పింఛన్ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ సమస్యలు వచ్చాయి?
వృద్ధులు, కూలీలు, దివ్యాంగుల వేలిముద్రలు చెరిగిపోవడం వల్ల ధృవీకరణ విఫలమై పింఛన్లు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరించింది?
ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ప్రవేశపెట్టి, ఆధునిక ఫింగర్ ప్రింట్ పరికరాలు, 5జీ స్మార్ట్‌ఫోన్లను పోస్టుమాస్టర్లకు అందజేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: