సిఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
హైదరాబాద్ : భూ కబ్జాలపై(Telangana) ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలోనే సంచలన పరిణామం చోటు చేసుకుంది. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాస ప్రాంతాల ముసుగులో మౌలిక వసతుల కల్పనకు వాడుతున్న రూ.4 వేల కోట్ల భూములపై రేవంత్(CM Revanth) సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెం.376లో అసలు ఏం జరిగిందో లెక్కలు తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.
Read also: BRS: బిఆర్ఎస్ఎల్పీ సమావేశం 21కి వాయిదా

హైదరాబాద్ ఐడీపీఎల్ భూముల అక్రమ కబ్జా
కాగా.. ఎమ్మెల్సీ కవిత, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని(Telangana) ఐడీపీఎల్ పరిశ్రమకు చెందిన విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరించి, వివిధ శాఖల అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా మేడ్చల్ కలెక్టర్ గుర్తించారు. ఇండస్ట్రియల్ జోన్ అని తెలిసి కూడా జిహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, జలమండలి ప్రైవేటు నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారిలో డిపార్ట్మెంట్లకు చెందిన అధికారుల సంఖ్య 50కి పైగా ఉన్నట్లుగా సమాచారం. తాజాగా, ఐడీపీఎల్ (దీశిలి) భూములపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో మరిన్ని ఆక్రమాలు బయటకు రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: