हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: రాష్ట్రంలో యూరియా కొరత

Sharanya
Telangana: రాష్ట్రంలో యూరియా కొరత

హైదరాబాద్: ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో కురుస్తున్న వర్షాలతో వానాకాలం సాగులో ఎరువుల కొరత ప్రధానంగా యూరియా (Urea) పెద్ద సమస్యగా తయారవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, జగిత్యాల తదితర జిల్లాల్లో రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Telangana: రాష్ట్రంలో యూరియా కొరత
Telangana: రాష్ట్రంలో యూరియా కొరత

యూరియా, డీఏపీ మందుల కోసం ఎదురుచూపు

ఒక పక్క వానకాలం సీజన్లో విత్తనాలు విత్తు కోవడం ప్రారంభం కావడంతో ఎరువులు అవసరమైన రైతులు దుకాణాల చుట్టు యూరియా, డీఏపీ మందుల కోసం పాకులాడుతున్నారు. అనుకూల వాతావరణం, రిజర్వాయర్ నీటి నిల్వలు పూర్తి స్థాయిలో ఉండటంతో పంటల సాగుపై దృష్టి సారించారు. దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్న నేపధ్యంలో ముఖ్యంగా యూరియాకు డిమాండ్ ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలంలో యూరియా, డీఏపీ కొరత తీవ్రంగా ఉండడంతో ఉదయం 6 గంటల నుంచే సహకార సంఘాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అరకొర యూరియాతో రైతులు ఇబ్బదులు పడుతున్నారు. మేలో 831 టన్నుల యూరియాకు గాను 419 టన్నులు, జూన్లో 4,153 టన్నులకు కేవలం 1,973 టన్నులు మాత్రమే సరఫరా చేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

యూరియా వినియోగంలో తెలంగాణ 5.8 శాతం వాటా

దీనికి తగినట్లుగా ఈ వానాకాలం సాగులో తెలంగాణ (Telangana) ఎరువుల వినియోగంలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇది గత ఏడాది కంటే మించిపోతుందని అంచనా. 2023-24లో దేశం మొత్తం దుకాణాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు 1.14 లక్షల టన్నుల ఎరువుల లోటు వానాకాలం సాగుపై నీలినీడలు యూరియా వినియోగంలో తెలంగాణ 5.8 శాతం వాటాను కలిగి ఉంది. ఇదే కాలంలో రాష్ట్రం 1.08 మిలియన్ టన్నుల డిఎపి, 0.16 మిలియన్ టన్నుల ఎంఒపి, 1.11 మిలియన్ టన్నుల ఎన్పికె కాంప్లెక్స్ ఎరువులను వినియోగించింది. 2023-24లో హెక్టారుకు 139.8 కిలోల మేర ఎరువుల వినియోగం ఉండగా, ఈ సారి అది 145 కిలోలకు చేరుకునే వీలుందని అంచనా. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో యూరియాకు లోటు ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం కేంద్రం వానాకాలం సాగుకై తెలంగాణకు 9.8 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. అయితే, ఏప్రిల్, మేలో 3.3 లక్షల టన్ను లకు 2.16లక్షల టన్నులు మాత్రమే పంపిణీ చేసింది, దీనితో 1.14లక్షల టన్నుల లోటు ఏర్ప డింది. ఇక ఏప్రిల్ 17 లక్షల టన్నులకు 1.22 లక్షల టన్నులు, మేలో 1.6 లక్షల టన్నులకు 0.94 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఈ నెలకు సంబంధించి కేటాయించిన 1.7 లక్షల టన్నులలో ప్రస్తుతం 37 శాతం మాత్రమే దేశీయంగా సేకరించబడుతుందని భావిస్తున్నారు, మిగిలిన 67 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎరువులు అధికంగా ఉపయోగించే వరి, మొక్కజొన్న సాగు విస్తరణ కారణంగా యూరియా డిమాండ్ పెరుగుతోంది. ఈ కొరత రైతులలో ఆందోళనకు కారణమైంది. కీలకమైన విత్తనాలు వేసే సమయంలో ఎరువుల లభ్యతను అంతరాయం లేకుండా చూసుకోవడానికి జూన్ నెల కేటాయింపులతో పాటు మిగిలిన 1.14 లక్షల టన్నుల లోటును త్వరగా తీర్చాలని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని లేఖ రాసినా ఇంత వరకూ అది కార్యరూపం దాల్చ లేదు.

Read also: LRS : LRS గడువు మరోసారి పెంచిన తెలంగాణ సర్కార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870