పలు ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్న రైతులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, అదనంగా నిల్వలు కూడా ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. (Telangana) ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి దాపురించింది. సరిపడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులు మళ్లీ రోడెక్కుతున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్ (Karimnagar) రూరల్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఆయా సంఘాలకు వచ్చిన యూరియా ప్రతిరోజు పంపిణీ చేస్తున్నప్పటికి సరిపోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆధార్ కార్డు, పట్టా దారు పుస్తకం ఆధారంగా ఓటీపీ చెబితేనే ఎకరానికి ఒక బస్తా అందజేస్తున్నారు.
Read also: Adluri Laxman: దివ్యాంగుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

క్యూలో నిలిచినా యూరియా దక్కని పరిస్థితి
ఈ యూరియా (Telangana) సరిపోవడం లేదని, ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్, దుర్శేడ్, చెర్లబూత్కూర్, నగునూర్ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలతో పాటు, తీగలగుట్టపల్లి జిల్లా మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎన్)కు యూరియా వచ్చింది. అయితే కొందరు రైతులు క్యూలో నిలబడి చివరకు యూరియా అందక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అలాగే ఖమ్మంజిల్లా చింతకాని మండలంలో కొందరు రైతులకు యూరియా కోసం కూపన్లు పంపిణీ చేశారు. అయితే అరకొరకగా మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి.
ఒక్కో రైతుకు సాగు విస్తీర్ణాన్నిబట్టి 5 నుంచి 10 కట్టల అవసరం ఉండగా, ఒకటీ రెండు బస్తాలు మాత్రమే సరఫరా చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి, చంద్రయ్యపల్లి, రామవరం, స్వామినాయక్ తండా, బుచ్చినాయక్ండా, రాంనగర్ గ్రామాల్లో రైతులు తెల్లవారుజామునే తరలివచ్చి క్యూ కట్టారు. చెన్నారావుపేట మండలం అక్కల్చెడ, పాపయ్యపేట, లింగగిరి గ్రామాల్లో రైతులు యూరియా కోసం చలిని సైతం లెక్క చేయకుండా దుప్పట్లు కప్పుకొని లైన్లో వేచి ఉన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం రైతులు ఉదయం 4 గంటల నుంచి పడిగాపులు కాశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: