తెలంగాణ లో ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలకమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ పరీక్షలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Read also: TG :నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్

ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా 97 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, సురక్షితంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకూ టెట్ తప్పనిసరి చేయడంతో వారు కూడా పరీక్ష రాయనున్నారు. పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: