తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల్లో (Temples) సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్చకులకు (Telangana temple priests ) రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇప్పటివరకు రూ.4 లక్షలుగా ఉన్న గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.8 లక్షల వరకు పెంచినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13,700 మంది అర్చకులు మరియు ఇతర ఆలయ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.
అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు
అర్చకుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ నిధి ద్వారా అర్చకులకు భవిష్యత్తులో మరిన్ని భద్రతా చర్యలు, సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలయాల్లో పని చేస్తున్న అర్చకుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం దీని ముఖ్య ఉద్దేశం.
అంతిమ సంస్కార ఖర్చులకు ఆర్థిక సహాయం పెంపు
అర్చక ఉద్యోగుల మరణించిన తర్వాత వారి కుటుంబాలకు ఇచ్చే అంతిమ సంస్కార ఖర్చులను కూడా ప్రభుత్వం పెంచింది. గతంలో ఈ కోసం రూ.20,000 అందించగా, ఇప్పుడు దానిని రూ.30,000కు పెంచినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అర్చకుల సేవలను గౌరవిస్తూ, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అంగీకరంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు.
Read Also : AP journalist : ఆధారాలున్నాయంటూ బుద్ధి మార్చుకోని జర్నలిస్ట్ కృష్ణంరాజు..