వ్యవసాయ డైరెక్టర్ గోపి ఉత్తర్వులు
Telangana : రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత యాసంగి సీజన్ సాగుకు సంబంధించి యూరియా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజను(Rabi Season)కు రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నప్పటికీ వాటి పంపిణీ తలెత్తుతున్న లోపాలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ప్రధానంగా యూరియా అందుబాటులో ఉన్నా రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి వెల్లడించారు.
Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

ఈ మేరకు దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా ఒక్కొక్క ప్రత్యేక అధికారికి నాలుగైదు జిల్లాలను కేటాయించారు. జిల్లాల్లో యూరియా పంపిణి సక్రమంగా జరిగేలా వీరంతా మానిటరింగ్ చేయనున్నారు. ఈ ప్రత్యేక అధికారులుగా వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్లు కే. విజయ్ కుమార్, బి.నర్సింహారావు, అడిషనల్ డైరెక్టర్లు ఎస్.గీత, వి. ఆశాకుమారి, వై. సుచరిత, బి. బాలు, ఎం. శైలజ, డిప్యూటీ డైరక్టర్లు ఎం.చంద్రశేఖర్, ఎం. కనకరాజులకు బాధ్యతలు అప్పగించారు.
వీరంతా పైలట్ ప్రాజెక్టు కింద యూరియా యాప్ కొనసాగుతున్న ఐదు జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కూడా సక్రమంగా పంపిణీ(Urea Distribution) చేసేలా చర్యలు తీసుకోనున్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పంపిణి చేసేలా ప్రత్యేక అధికారులు జిల్లాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: