తెలంగాణ (TG) రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబర్ సమ్మిట్‌ను (Telangana Global Summit) రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ వేధిక అయిన ఫ్యూచర్ సిటీలోని మీర్‌ఖాన్‌పేట పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది.
Read Also: Kavitha: మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు
తెలంగాణ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు
దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్‌ను వారికి అందజేయనున్నారు.

అందులో సకినాలు, నువ్వుల లడ్డూ, గారెలు, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు ఉన్నాయి. ఇక లంచ్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీ, విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాల వంటలను రెడీ చేస్తున్నారు. అంతేకాక, తెలంగాణ (TG) పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. ప్రభుత్వం తరఫున అతిథులకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని అందించనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: