हिन्दी | Epaper

Telangana schools: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు

Saritha
Telangana schools: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు

Telangana schools: తెలంగాణ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ (HYD) సహా వివిధ జిల్లా కేంద్రాల్లోని రహదారులపై జన సంచారం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read Also: Kodad Adulterated Cooking Oil: ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

Telangana schools: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
Telangana schools: Single-day schools from the 16th of this month

మార్చి 16 నుంచి స్కూల్ టైమింగ్స్ మార్పు

తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్‌ 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు కూడా కచ్చితంగా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎవరికీ మినహాయింపు ఉండదని.. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు తెరిచి ఉండటానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి.. వేసవి సెలవులపై కూడా తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఏఫ్రిల్ 23 స్కూళ్లకు చివరి పని దినం కాగా.. ఏఫ్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870