Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు గుడ్ న్యూస్. ఈ నెల 19న మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ (indira gandhi) జయంతి సందర్భంగా చీరలను వారికి కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి దసరా, బతుకమ్మ సంబరాల సందర్భంగా చీరలను పంపిణీ (Saree distribution scheme) చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. దీంతో అప్పటి వరకు రాష్ట్రంలోని మహిళలు చీరల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చీరలను పంపిణీ చేసేందుకు ఎదురుచూస్తోంది. ఈ మేరకు డీఆర్డీవో అధికారులకు ఆదేశాలు వచ్చాయి.
Read also: Hyderabad: డబ్బును డిమాండ్ చేస్తూ ఇంటి యజమాని పై హిజ్రాల దాడి

Telangana: ఈనెల 19న తెలంగాణా మహిళలకు చీరల పంపిణీ
అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరు’తో చీరల సరఫరా
Telangana: గత ప్రభుత్వకాలంలో రేషన్ కార్డులో ఉన్నవారికి ఒక చీర చొప్పున సరఫరా చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారికి ‘అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక ‘పేరు’తో ఏడాదికి రెండు చేనేత చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన చీరలు ఇప్పటికే జిల్లాలకు రాగా, వాటిని గోదాముల్లో భద్రపరిచారు. తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షలమంది ఎస్ హెచ్సీ మహిళలకు చీరలను ఉచితంగాఇస్తామని గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: