హైదరాబాద్: దేశవ్యాప్తంగా రుతుపవనాల కారణంగా విస్తృతంగా వర్షాలు పడుతున్నప్పటికీ తెలంగాణ (Telangana) లోని పలు జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చినప్పటికి వర్షాలు మాత్రం ఊహించిన స్థాయిలో పడలేదు. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం (Severe rain shortage in many districts) ఏర్పడింది.

ఈ నేపథ్యంలో దేశంలో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న జిల్లాలను గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు రిపోర్టు తయారు చేసి కేంద్రానికి పంపారు. అందులో తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మూడు జిల్లాలు (Three districts) తీవ్రవర్షాభావం ఎదుర్కొంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కునేందుకు గాను కేంద్రం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు రూ. 100 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఉపయోగించనుంది. అయితే కేంద్ర విడుదల చేసిన రూ. 100 కోట్ల నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 50 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana Rising: తెలంగాణ రైజింగ్-2047.. రాష్ట్రం అందరినీ ఆహ్వానిస్తోంది : సిఎం రేవంత్ రెడ్డి