హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ భాషపై తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రాలో మరాఠీ, కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళం నేర్చుకోవాలని ఆయా ప్రాంతాల్లో ఇతర భాషలు మాట్లాడే వారిపై ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. భాషల మధ్య చర్చలు జరుగుతుండగా తెలంగాణకు భాష, కులం, మతం సంబంధం లేకుండా ఎవరైనా రావొచ్చు అనే సంకేతాలను తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది.

వివిధ భాషల లిపితో తెలంగాణ మ్యాప్
తాజాగా తెలంగాణ రైజింగ్-2047 (Telangana Rising) పేరుతో వివిధ భాషల లిపి (Scripts of different languages) తో కూడిన తెలంగాణ మ్యాప్ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అందులో తెలుగు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, కన్నడ, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ వంటి వివిధ దేశాలలోని భాషలతో ‘స్వాగతం’ అని రాసి ఉంది. హైదరాబాద్ అందరినీ ఆహ్వానిస్తోంది‘ అని పోస్టర్ టైటిల్ తో పాటు తెలంగాణ రైజింగ్-2047 (Telangana Rising) వెల్కమ్స్ లోగో, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పోస్టర్ విడుదల అయింది. పెట్టుబడులు, వ్యాపారం, జాబ్, చదువు, సెటిల్ అవ్వడానికి, ట్రావెల్ చేయడానికి హైదరాబాద్ రావొచ్చని పోస్టర్లో అర్థమవుతుంది. అలాగే ‘మీరు ఏ భాష మాట్లాడినా, ఏ దుస్తులు ధరించినా, ఎవరితో నివసిస్తున్నా, మీరు నమ్మే విశ్వాసం ఏదైనా.. కూడా హైదరాబాద్ మిమ్మల్ని స్వాగతిస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ వైరల్ అవ్వడంతో అంకిత్ కుమార్ అవస్థి అనే యూజర్ ఎక్స్ వేదికగా ఫొటోను షేర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రశంసల జల్లు కురిపించారు. భాష పేరుతో రాజకీయాలు నడుస్తున్నవేళ సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న చొరవతో ఉత్తేజకర మైందని పేర్కొన్నారు. లేబర్, ట్యాలెంట్ అనేది భాషపై ఆధారపడి ఉండదని, ఆర్థిక అభివృద్దే అవసరమని సిఎం రేవంత్రెడ్డి అర్థం చేసుకు న్నారని ట్విట్లో పేర్కొన్నారు. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా ఆ ట్వీట్ను రీ ట్వీట్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు. మొదట అంకిత్ కుమార్ అవస్థ యూజర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్ ఎల్లప్పుడూ దేశమే కాదు ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉందని సిఎం పేర్కొన్నారు. సిఎం రేవంత్రెడ్డి ట్వీట్పై నెటిజన్లు ప్రశంసించారు .
తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఏమిటి?
తెలంగాణ రైజింగ్ 2047 అనేది రాష్ట్రాన్ని నూతన దిశగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు రూపొందించిన దీర్ఘకాలిక విజన్. 2047 నాటికి తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించబడింది.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ప్రోత్సాహం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ రంగాలలో అభివృద్ధి చేపట్టడం ప్రధాన ఉద్దేశం.
Read hindi news: hindi.vaartha.com
Read also: Kaleshwaram: కన్సల్టెన్సీ ఏజన్సీల సౌజన్యంతో కాళేశ్వరం పునరుద్ధరణ చర్యలు