విదేశాలతో పోటీ పడేలా, రాష్ట్ర అభివృద్ధిని (TG) ప్రతిబింబించేలా ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047 పాలసీ’ (Telangana Rising 2047) డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ (TG) రైజింగ్ 247 పాలసీ పైన ఆయన ప్రత్యేకమైన దృష్టితో ఉన్నారు. ఈ పాలసీ ద్వారా తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నారు.
Read Also: Harish Rao: కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలంటూ హరీశ్ రావు విమర్శ
రేవంత్ (Revanth Reddy) ప్రభుత్వం యువతకు పెద్దపీఠ వేస్తోంది. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రంలో 1.41 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే టార్గెట్‌తో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రైజింగ్ విజన్ 2047(Telangana Vision 2047) లో భాగంగా టాలెంట్ హైపర్‌లూప్ 2047 పేరుతో ‘స్కిల్లింగ్ ఎకో సిస్టమ్‌ను’ ఆవిష్కరించింది.
డిగ్రీ పట్టాలు ఉన్నప్పటికీ నైపుణ్యాలు లేకపోవడం చాలామంది యువతకు ఉద్యోగాలు దొరకడం లేవు. ఇలాంటి నిరుద్యోగులకు ఈ పాలసీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం విజన్-2047లో భాగంగా వినూత్న పద్ధతిని ప్రతిపాదించింది. రాష్ట్రంలో జరిగే మెట్రో రైలు నిర్మాణం, బీఆర్డీఎస్ కారిడర్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, వాటర్ గ్రిడ్ పనులను ఆన్‌సైట్ ట్రైనింగ్ గ్రౌండ్స్‌గా మార్చనున్నారు.

1.41 కోట్ల ఉద్యోగాలు సృష్టించడమే టార్గెట్
పనులు జరుగుతుండగానే యువత అక్కడ పాల్గొంటారు. అక్కడున్న మిషీన్లను ఆపరేట్ చేయడం, టెక్నాలజీని నేర్చుకునే సదుపాయం ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి వేలాదిమంది నిపుణులు వచ్చేస్తారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, నిమ్జ్‌లాంటి ప్రాంతాల్లో ఆయా రంగాలకు సంబంధించిన వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో క్లస్టర్లవారీగా పరిశ్రమల అవసరాలను గుర్తిస్తారు. ప్రస్తుతమున్న స్కిల్లింగ్ కెపాసిటీని 2 నుంచి 3 రేట్లు పెంచాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. మొత్తానికి ‘హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఇన్‌క్లూజన్ మిషన్’ కింద 2047 నాటికి 1.41 కోట్ల ఉద్యోగాలు సృష్టించడమే టార్గెట్‌గా పెట్టుకుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: