రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(Telangana) బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముంబైలో జరిగింది. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి వివాహ వేడుకలో పాల్గొనేందుకు రేవంత్ నిన్న ముంబైకి వెళ్లారు. ఆ సందర్భంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా సీఎం రేవంత్‌ను కలిశారు.
ఈ భేటీ పూర్తిగా స్నేహపూర్వక వాతావరణంలో సాగినట్లు తెలిసింది. సల్మాన్, రేవంత్ రెడ్డి మధ్య సినీ రంగం, తెలంగాణలో సినిమా నిర్మాణ అవకాశాలు, మరియు రాష్ట్రం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
Read also: వలసవిధానంపై జేడీ వాన్స్ పై ప్రశ్నల వర్షం కురిపించిన భారత మహిళ

తెలంగాణ రైజింగ్’కు అంతర్జాతీయ ప్రచారం అందిస్తానని హామీ
తెలంగాణ ప్రభుత్వం(Telangana) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ అనే నినాదం గురించి సీఎం రేవంత్ వివరించగా, సల్మాన్ ఖాన్ ఆ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, టూరిజం, సినీ రంగ ప్రోత్సాహంపై రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలను సల్మాన్ ప్రశంసించినట్లు సమాచారం. ఈ భేటీ రెండు రాష్ట్రాల మధ్య సినీ, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా రాజకీయ, సినీ వర్గాలు చూస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: