हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: TG: విద్యార్థులు లేని స్కూళ్ల జాబితాలో రెండో స్థానంలో తెలంగాణ

Aanusha
Latest News: TG: విద్యార్థులు లేని స్కూళ్ల జాబితాలో రెండో స్థానంలో తెలంగాణ

మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, బట్టలు, స్మార్ట్ క్లాస్ రూమ్‌లు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా… ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Union Ministry of Education) తాజాగా విడుదల చేసిన గణాంకాలు విస్తృత చర్చకు దారితీశాయి.

Read Also: Vijay: కరూర్‌ తొక్కిసలాట..దర్యాప్తు చేపట్టిన సీబీఐ

2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జీరో ఎన్‌రోల్‌మెంట్’ నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమబెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది.

ఆ తర్వాత తెలంగాణ (TG) 2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే, విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 17,965 మంది ఉండగా, తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించబడ్డారు.

మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలు

తెలంగాణ (TG) తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం.పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దమన్‌ దీవ్- దాద్రానగర్ హవేలీ, చండీగఢ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలు ఒక్కటి కూడా లేవు.

TG
TG

అలాగే హరియాణా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి పాఠశాలలు సున్నాగా నమోదు అయ్యాయి. ఈ గణాంకాలు ఆయా రాష్ట్రాల్లోని విద్యా నిర్వహణ విధానాల సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య

అయితే, గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954గా ఉండగా, ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గడం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు.

మరోవైపు, ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతంలోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870