తెలంగాణలో భారీ వర్షాలు (Telangana Rains) కురవనున్నాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Department) వెల్లడించింది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

ఈ రోజు వర్షాలు కురిసే జిల్లాలు
ఈరోజు రంగారెడ్డి (Ranga Reddy), యాదాద్రి భువనగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాల ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
రేపటి వర్ష సూచన
రేపు నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
ఎల్లుండి నాగర్‌కర్నూల్, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీమ్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: