తెలంగాణలో ఇటీవల సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గడం గమనార్హం. సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న బియ్యం ధరల్లో ఈ తగ్గుదల వలన వినియోగదారులకు ఊరట కలిగింది. గతంలో క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పలికిన ధరలు ఇప్పుడు రూ.4,000 నుండి రూ.4,500 మధ్యకే పరిమితమయ్యాయి.ఈ ధరల తగ్గుదల వెనుక ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల ప్రభావం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ (Bonus) ను ప్రకటించడం, రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం సరఫరా పెంచడం వంటి చర్యలు మార్కెట్‌లో డిమాండ్‌ను తక్కువ చేశాయి. దీంతో సరఫరా పెరిగి ధరలు స్వయంగా తగ్గుముఖం పట్టాయి.రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ సన్న వడ్లపై రూ.500 బోనస్ ప్రకటించడంతో సన్న వడ్ల సాగు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయింది. దీంతో ధాన్యం దిగుబడి భారీగా పెరిగి, సప్లై కూడా పెరిగింది. ఇది ధరలపై ప్రభావం చూపింది.
బియ్యం ధరలు
రాష్ట్రవ్యాప్తంగా 2.60 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు 17,349 రేషన్ షాపుల ద్వారా గత నెలలో మూడు నెలలకు సంబంధించి 4.73 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ భారీ పంపిణీ కారణంగా బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం (Sanna biyyam) డిమాండ్ గణనీయంగా తగ్గింది.దానికి తోడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి సన్న బియ్యం ఆర్డర్లు తగ్గడం కూడా ధరల పతనానికి మరో కారణమని వ్యాపారులు చెబుతున్నారు.కాగా, జూన్ నుంచి క్రమంగా బియ్యం ధరలు తగ్గుతున్నాయి.జూలై మొదటి వారంలో మరింత పడిపోయాయి. గత ఏడాది క్వింటాల్ రూ.5,600 ఉన్న హెచ్ఎంటీ రకం బియ్యం ధర ఇప్పుడు రూ.4,600కు తగ్గింది. కర్నూల్ మసూరి రకం రూ.4,000కు చేరుకోగా, జై శ్రీరాం రకం రూ.5,800 నుంచి రూ.4,600కు పడిపోయింది.

టన్నుల బియ్యం
ఆర్ఎన్ఆర్, సాంబా రకాల ధరలు కూడా క్వింటాల్ రూ.1,000 వరకు తగ్గాయి.తగ్గిన ధరలు మధ్యతరగతి వినియోగదారులకు ఎంతో ఊరట కలిగిస్తున్నాయి.రేషన్ కార్డులు లేని సుమారు 30 లక్షల కుటుంబాలకు, నెలకు 60 వేల టన్నుల బియ్యం అవసరం ఉండగా వారికి ఈ ధరల తగ్గుదల లాభదాయకంగా మారింది. అయితే, బహిరంగ మార్కెట్‌లోని బియ్యం వ్యాపారులకు గిరాకీ 20 శాతానికి పైగా పడిపోయింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రైస్ షాపుల్లో రోజువారీ కొనుగోళ్లు భారీగా తగ్గాయని, కొన్ని ప్రాంతాల్లో బోనీ కూడా లేదని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో నెలకు 250 క్వింటాళ్ల బియ్యం అమ్మిన షాపులు ఇప్పుడు 100 క్వింటాళ్లు కూడా అమ్మలేని పరిస్థితి నెలకొందని రామంతపూర్‌కు చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి ఆందోళన వ్యక్తం చేశారు.
సన్న బియ్యం తినడం వల్ల ఉపయోగాలు ఏమిటి?
సన్న బియ్యం అనేది తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే రకం బియ్యం. ఇది పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించడమే కాకుండా, వివిధ వంటకాలకు అనువుగా ఉంటుంది.
సన్న బియ్యం,పెద్ద బియ్యం మధ్య తేడా ఏంటి?
సన్న బియ్యం: మెత్తగా వండుతుంది, తేలికగా జీర్ణమవుతుంది. పెద్ద బియ్యం: కొంచెం గట్టిగా వుంటుంది, ఎక్కువ నీటి శాతం ఉంటుంది. వంటకు కొంత ఎక్కువ సమయం పడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Teenmar Mallanna: కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : తీన్మార్ మల్లన్న