పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Politics) అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Read also: Irrigation Projects:నదీజలాలపై సీఎం వ్యాఖ్యలపై KTR ఫైర్

కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు పూర్తిగా సిద్ధంగా(Telangana Politics) ఉన్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీ తొలి రోజున సభకు హాజరైన కేసీఆర్ కేవలం మూడు నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సవాల్ విసిరిన తర్వాత సభకు రాకపోతే పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: