Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులను మార్చి 15వ తేదీలోపు పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఈ కీలక విషయాలను పంచుకున్నారు.
Read Also: Doctorate to Kinnera Mogulaiah : డాక్టరేట్ అందుకున్న పద్మశ్రీ కిన్నెర మొగులయ్య

మంత్రులతో ఉన్నత స్థాయి భేటీ
రాష్ట్ర మంత్రులందరితో కాంగ్రెస్ అగ్ర నేతలు సమావేశమై, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ నిర్మాణ బలోపేతంపై చర్చించారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చలో భాగంగా మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై ప్రత్యేక ఫోకస్
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం తీసుకుంటున్న చర్యలను అధిష్టానానికి వివరించారు.
రాజగోపాల్ రెడ్డి అంశంపై స్పష్టత
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశంపై కూడా చర్చించామని, త్వరలోనే ఆయనతో మాట్లాడుతామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత సమన్వయం కోసం ఈ చర్చలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: