Telangana CMO, Bomb Threat: తెలంగాణ(Telangana) సీఎంవో మరియు లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద మెయిల్ అందిన వెంటనే అధికారులు హై అలర్ట్ ప్రకటించి, బాంబు దళంతో భవనం మొత్తాన్ని పరిశీలించారు.
గవర్నర్ కార్యాలయానికి “ఖాన్” అనే వ్యక్తి పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో సీఎంవో మరియు లోక్ భవన్(Lok Bhavan)ను పేల్చివేయాలనే కుట్ర జరుగుతోందని పేర్కొన్నట్లు సమాచారం. భవనాలను వెంటనే ఖాళీ చేయాలని కూడా మెయిల్‌లో పేర్కొనడంతో అధికారులు తక్షణమే స్పందించారు. బాంబు స్క్వాడ్ మొత్తం ప్రాంగణాన్ని శోధించగా, పోలీసులు ఈ బెదిరింపు మెయిల్‌పై సవివర దర్యాప్తు ప్రారంభించారు.
Read also: POCSO: మనవరాలిపై దారుణం చేసిన తాతకు 20 ఏళ్ల జైలు శిక్ష

బాంబు బెదిరింపు మెయిల్‌తో తెలంగాణలో హై అలర్ట్
ఇక మరోవైపు, శంషాబాద్ విమానాశ్రయానికి కూడా మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉంచినట్లు పేర్కొంటూ, పేలుడును ఆపాలంటే మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు విమానాన్ని ఐసోలేషన్ బేలో ఉంచి సంపూర్ణ తనిఖీలు జరిపారు. ఈ బెదిరింపు మెయిల్ న్యూయార్క్ నుంచి పంపించినదని అధికారుల చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి బెదిరింపు కాల్స్, మెయిల్స్ పెరుగుతుండటం వల్ల భద్రతా శాఖలు తరచూ అలర్ట్ స్థితిలోనే పనిచేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: