తెలంగాణలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో కీలకమైన ముందడుగు వేసింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, మొత్తం 12,452 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
పోలీస్ శాఖ నివేదికతో నోటిఫికేషన్‌కు వేగం
పోలీస్ శాఖ వివిధ విభాగాల్లో ఖాళీల గణాంకాలను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సమగ్ర నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ వివరాలను ఆర్థిక శాఖకు అందజేయడంతో నోటిఫికేషన్ ప్రక్రియ వేగం పొందనుంది.

కానిస్టేబుల్ పోస్టుల్లో భారీ సంఖ్యలో ఖాళీలు
నివేదిక ప్రకారం, అత్యధికంగా ఖాళీలు సివిల్ పోలీస్ (Civil Police) కానిస్టేబుల్ విభాగంలో ఉన్నాయి. మొత్తం 8,442 పోస్టులు ఖాళీగా ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్ విభాగంలో 3,271 ఖాళీలు ఉన్నాయి. ఈ రెండు విభాగాల ఖాళీలను కలిపితే దాదాపు 11,713 పోస్టులు కానిస్టేబుల్ స్థాయిలో ఉండటం విశేషం. ఇది నిరుద్యోగ యువతకు ఒక గొప్ప అవకాశంగా మారనుంది.
ఎస్సై స్థాయిలో కూడా గణనీయమైన అవకాశాలు
కానిస్టేబుల్ పోస్టులతో పాటు, సబ్-ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగాలు కూడా మినహాయించలేనివే. అం దుబాటులో ఉన్న ఖాళీల్లో సివిల్ ఎస్సై – 677, ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్సై(Armed Reserve Police Force) – 40,టీజీఎస్‌పీ ఎస్సై – 22ఈ ఉద్యోగాలు కూడా త్వరలో భర్తీకి వచ్చే అవకాశముంది. పోలీస్ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉండటంతో, నియామక ప్రక్రియ ఆలస్యం కాకుండా జరిగే అవకాశం ఉంది.
ఎన్నికల హామీకి తగ్గట్లుగా ముందడుగు
ఈ భారీ పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలులో భాగంగా చేపట్టిన చర్యగా భావించవచ్చు. అప్పట్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, లక్షల కొలువులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రక్రియ ఆ దిశగా సాగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: