హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ఎట్టకేలకు పోలీసు కంప్లయింట్ అథారిటీ (Police Complaint Authority) ఏర్పాటయింది. బిఆర్కె భవన్లో ఇంతకు ముందు కాళేశ్వరం (Kaleswaram) కమిటీ కార్యాలయం వున్న ఛాంబర్లో ఏర్పాటయిన పోలీసు కంప్లయింట్ అథారిటీని చైర్మన్ గా నియమితులైన విశ్రాంత జడ్జి జస్టిస్ శివశంకర్రావు ప్రారంభించారు.
ఫిర్యాదులను స్వతంత్రంగా విచారిస్తుందని
డిఎస్పి అంతకు పైస్థాయి అధికారులపై వచ్చే ఫిర్యాదులను ఈ విభాగం స్వతంత్రంగా విచారిస్తుందని ఈ సందర్భంగా జస్టిస్ శివశంకర్రావు (Justice Sivashankar Rao) తెలిపారు. పోలీసు కంప్లయింట్ అథారిటీ (Police Complaint Authority) ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులను తమ సంస్థ నిస్పక్షపాతంగా విచారించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు కంప్లయింట్ అథారిటి ఎంతో కీలకమైనదని ఆయన వెల్లడించారు. ఇటువంటి విభాగాల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై, ప్రజా స్వామ్యంపై మరింత నమ్మకం కలుగుతుందని ఆయన తెలిపారు. పోలీసు అధికారులు తప్పిదాలకు, అక్రమాలకు పాల్పడితే ప్రజలు ధైర్యంగా ముం దుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా వుంచుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోలీసు కంప్ల యింట్ అథారిటిలో సభ్యులుగా వున్న విశ్రాంత ఐజి ప్రమోద్ కుమార్, విశ్రాంత జిల్లా జడ్జి వర్నే వెంకటేశ్వర్లు, వై. అరవింద్రెడ్డి, రాంనరసింహా రెడ్డి, రాజేందర్, శాంతిభద్రతల ఎఐజి రమణకుమార్ కూడా పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: