తెలంగాణ (Telangana) లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ DCP రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.
Read also: TG: డ్వాక్రా సంఘాల బకాయిలపై సర్కార్ ఉక్కుపాదం
హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకొం
గతంలో తెలంగాణ (Telangana) హైకోర్టు హరీశ్ రావు, రాధాకిషన్ రావులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో హరీశ్ రావు ఈ కేసు నుంచి ఊరట పొందినట్టయింది.

బీఆర్‌ఎస్ నేతలు దీన్ని పెద్ద విజయంగా చూస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు పెడుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తీర్పుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: