గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినందున (Telangana) ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఎన్నికలను (Elections) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టాయి.
Read also: Hyderabad: డిజిటల్ అరెస్టు కు గురైన వృద్ధుడు

ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న పురపాలక శాఖ
(Telangana) తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది. ఈ నెల 10న తుది జాబితా వెలువరించనుంది. ఆ మరునాడు అంటే జనవరి 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా కుదరకపోతే పండుగ ముగిసిన తర్వాత 20న విడుదల చేస్తారు. దీనికి అనుగుణంగా, మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్దిశాఖ సిద్ధమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: