తెలంగాణ (Telangana) లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బదిలీలతో పాటు కొందరు గ్రూప్-1 అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించగా, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా ఏర్పాటైన జోన్లకు జోనల్ కమిషనర్లను నియమించారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈమేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. (Telangana) తాజా బదిలీల్లో భాగంగా, సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్‌ను హెచ్‌ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Read Also: Chicken & Eggs: పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు
అదనపు బాధ్యతలు
ఆయనకు పురావస్తుశాఖ సంచాలకులుగా, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావుకు పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీశాఖ ఉపకార్యదర్శి భవేష్ మిశ్రాకు పరిశ్రమలు, పెట్టుబడులశాఖ అడిషనల్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
GHMCలో జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు పెంచిన నేపథ్యంలో, వీటికి 12 మంది జోనల్ కమిషనర్లను నియమించారు.ఇందులో భాగంగా, రాధికాగుప్తాను ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో జీఎంగా పనిచేస్తున్న డి. హన్మంతునాయక్‌కు కార్పొరేషన్ వీసీ, ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. జి. జితేందర్ రెడ్డిని హైదరాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా నియమించారు.

సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న ఎం. హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. అదే జిల్లాకు అదనపు కలెక్టర్‌గా ఉన్న గరిమా అగర్వాల్‌కు సిరిసిల్ల కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు.ఈవీ నరసింహారెడ్డి మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. నిర్మలా కాంతి వెస్లీ హ్యూమన్‌రైట్స్ కమిషన్ సెక్రటరీగా నియమితులయ్యారు. అలాగే బీ. షఫీఉల్లా(ఐఎఫ్‌ఎస్)కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: