తెలంగాణలో వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బుధవారం ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటులకు గురై 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వేర్వేరు జిల్లాల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.
నిర్మల్ జిల్లాలో భార్యాభర్తలు సహా ముగ్గురు మృతి
నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామంలో మృతి చెందిన వారిలో అలకుంట ఎల్లయ్య, ఆయన భార్య ఎల్లవ్వ, బండారు వెంకటి ఉన్నారు. వీరిద్దరూ వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

జోగులాంబ గద్వాలలో పొలంలో పత్తి తీయగా విషాదం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో కూడా హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పొలంలో పత్తి పనులు చేస్తున్న పార్వతమ్మ (22), సర్వేశ్ (20), సౌభాగ్యమ్మ అనే ముగ్గురు పిడుగుపాటు (thunder) కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.
ఖమ్మం జిల్లాలో గేదెలకు మేత పెట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ (35) పశువులకు మేత పెట్టేందుకు వెళ్లాడు. వర్షం మొదలవ్వడంతో ఒక చెట్టు దగ్గర తలదాచుకున్న అతను పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మదిర మండలంలో రైతు పిడుగు బారినపడుతూ ప్రాణాలు కోల్పోయాడు
మరోవైపు మదిర మండలం మడుపల్లి గ్రామంలో వ్యవసాయ పనుల్లో మునిగిపోయిన గడిపూడి వీరభద్రరావు అనే రైతు పిడుగుపాటుతో మరణించాడు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: