Telangana: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్వహణపై రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. దేశం మొత్తం గర్వించేలా జాతర అభివృద్ధి పనులను చేపట్టాలని, ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ మహా జాతరకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి సీఎం వారంలోగా పర్యటిస్తారని మంత్రి చెప్పారు.

150 కోట్లతో అభివృద్ధి పనులు, సీఎం పర్యటన
మంగళవారం మంత్రి సీతక్క(Minister Sitakka) మేడారం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర లతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న విఐపి పార్కింగ్ రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్, హరిత హోటల్ వంటి ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశపు హాల్లో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో మేడారం జాతర 2026పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లను కేటాయించిందని, ఈ నిధులతో అధికారులు 100 రోజుల నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు
గద్దెల ప్రాంతంలో ఆదివాసీ(Adivasi) సంప్రదాయాలకు, పూజారుల మనోభావాలకు అనుగుణంగా శాశ్వతంగా ఉండే విధంగా నూతన హంగులతో అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. మేడారం గ్రామస్థులు, పూజారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ జాతర రాష్ట్ర పండుగతో పాటు మరో కుంభమేళా తరహాలో జరగనుందని, దీనికి సాధారణ పౌరుల నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వివిఐపిలకు ఇబ్బందులు లేకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అన్నారు. దేవుళ్ల ప్రాంతంలో రాజకీయాలు చేసే ఏ నాయకుడూ ఎదగలేరని, రాబోయే మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. భక్తుల్లో అమ్మవార్లపై భక్తి, విశ్వాసం పెంపొందించేలా జాతర ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మేడారం జాతర 2026 ఎప్పుడు జరుగుతుంది?
వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనుంది
మేడారం జాతర కోసం ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది?
భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయలను కేటాయించింది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: