తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు. ప్రజా పాలన ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఇప్పుడు టీజీఆర్‌టీసీలో 3038 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సుదీర్ఘ కాలం తరువాత ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగడం చాలా కీలక పరిణామంగా మారింది.

మొత్తం 3,038 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. వీటిలో అత్యధికంగా 2,000 డ్రైవర్ పోస్టులు ఉండగా, శ్రామిక్ పోస్టులు 743గా ఉన్నాయి. అలాగే, వివిధ స్థాయిలలోని సాంకేతిక, నిర్వహణ మరియు వైద్య విభాగాల్లోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి పునర్నిర్మాణ, అభివృద్ధికి దోహదపడేలా, టీజీఆర్‌టీసీలో బలోపేతానికి ఈ నియామకాలు అవసరమని స్పష్టంచేశారు.
మొత్తం 3038 ఉద్యోగాల్లో.. పోస్టులు ఇలా
బస్ డ్రైవర్: 2000
శ్రామిక్ (వర్క్‌మెన్): 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్): 114
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్: 18
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
అకౌంట్స్ ఆఫీసర్: 6
మెడికల్ ఆఫీసర్ (జనరల్): 7
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్): 7
ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలకు అంకితభావంతో సిద్ధమవుతున్న ప్రభుత్వం, నిరుద్యోగులకు సూచనలు చేస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం 60,000కి పైగా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులలో నమ్మకాన్ని పెంచిందని మంత్రి తెలిపారు. అదే దిశగా ఇప్పుడు RTCలో నియామకాల ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణంగా RTC నోటిఫికేషన్‌లు ఆలస్యం అయ్యాయని, ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తవడంతో నియామకాల్లో వేగం తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అవకాశాలను నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
Read also: Bhatti Vikramarka: హెచ్‌సీయూ విద్యార్థుల కేసుల తొలగింపుపై..భట్టి చెప్పినవి వట్టి మాటలేనా?