తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మహిళల రాజకీయ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, మహిళలు రాజకీయాల్లో చురుగ్గా ఉండడమే తప్పా? అని ఆమె ప్రశ్నించారు. దేశ చరిత్రను పరిశీలిస్తే, దేశం కోసం పోరాడిన అనేక మహిళలు ఉన్నప్పటికీ వారికి పెద్ద స్థాయి పదవులు దక్కలేదని కవిత (kavitha) పేర్కొన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు వస్తేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Read also: Rural development : గ్రామీణాభివృద్ధికి అడుగులు పడేనా?
Telangana Jagruthi
గతంలో కేసీఆర్ ప్రభుత్వం 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పుడు, ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదని కవిత గుర్తు చేశారు. ఆ సమయంలోనే తాను ఈ అంశాన్ని నేరుగా కేసీఆర్‌ను ప్రశ్నించానని ఆమె వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నా, నిర్ణయాత్మక స్థానాల్లో అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమని అన్నారు. మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభిస్తేనే రాజకీయ వ్యవస్థ సమతుల్యంగా మారుతుందని కవిత స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: