తెలంగాణ (Telangana) లో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల నిర్వహణలో కీలక మార్పుకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షలకు 45 రోజుల నుంచి రెండు నెలల ముందుగానే ఈ హాల్‌టికెట్లను పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల రెండింటికీ ఎంతో ఉపయోగకరంగా మారనుందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
Read also: TG: రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!
దీనివల్ల తల్లిదండ్రులు హాల్‌టికెట్‌లోని తప్పులను ముందే గుర్తించి, కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేసే అవకాశం ఉంటుంది. అధిక శాతం తల్లిదండ్రుల వద్ద స్మార్ట్‌ఫోన్‌లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హాల్‌టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయడమే దీని ఉద్దేశ్యం.

హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు తమ SSC రోల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తమ మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తమ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ఫోన్ ఉన్నందున, సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ఈ వాట్సాప్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: