తెలంగాణ (Telangana) లో అర్హులైన ప్రతి పేద మహిళకు ‘ఇందిరమ్మ చీరలు’ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని దాదాపు 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో (Telangana)పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల వాయిదా పడగా.. మళ్లీ చీరల పంపిణీని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి ఈ చీరలను పొందవచ్చు.
Read also: Sankranthi Holidays 2026 in Telangana : సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆధార్ కార్డు ఆధారంగా చీరలను అందజేస్తున్నారు
అర్హులైన ప్రతీ మహిళకు చీరలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే.. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండగా.. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా చీరలను అందజేస్తున్నారు. ఒకవేళ ఆధార్, రేషన్ కార్డులు రెండూ లేకపోయినా.. బిలో పావర్టీ లైన్ (BPL) కిందకు వచ్చే పేద మహిళలు తమ ఓటర్ కార్డును చూపించి చీరలను తీసుకోవచ్చు. సదరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తింపు ఉండి, అర్హత కలిగి ఉంటే చాలు.. ఎటువంటి సాంకేతిక కారణాలతో పంపిణీ ఆగిపోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో.. ప్రభుత్వం పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించింది. పట్టణాల్లోని సుమారు 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈ పంపిణీని చేపట్టనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: